పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలో మళ్లీ పులి కలకలం రేగుతోంది.
మళ్లీ పులి కలకలం
Aug 8 2017 12:24 PM | Updated on Sep 11 2017 11:36 PM
ద్వారకా తిరుమల: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలో మళ్లీ పులి కలకలం రేగుతోంది. ద్వారకా తిరుమల గ్రామ శివార్లలో పులి కాలి గుర్తులను స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. యాత్రాస్థలమైనందున నిత్యం వేలాదిమంది భక్తులతో రద్దీగా ఉంటుందని, పులి వల్ల హాని జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందజేశారు. కాగా, రెండు నెలల క్రితం తిరుమనపాలెం గ్రామ అటవీ ప్రాంతంలో ప్రజలు చిరుతను సంగతి విదితమే. పాద ముద్రల ఆధారంగా చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.
Advertisement
Advertisement