ఈ ఏడాది రూ. 500 కోట్ల రుణాల పంపిణీ | This year, Rs. 500 crore loan distribution | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది రూ. 500 కోట్ల రుణాల పంపిణీ

May 26 2016 8:21 AM | Updated on Sep 4 2017 12:55 AM

ఈ ఏడాది రూ. 500 కోట్ల రుణాల పంపిణీ

ఈ ఏడాది రూ. 500 కోట్ల రుణాల పంపిణీ

ఈ ఏడాది జిల్లా సహకార కేంద్రబ్యాంకు ద్వారా అన్ని పథకాల కింద రూ.500 కోట్ల వరకు రుణాలు పంపిణీ

ఎరువుల వ్యాపారానికి బ్యాంకు గ్యారంటీ
రూ.25 లక్షలకు పెంపు
గ్రాము బంగారంపై ఇక రూ.1800 రుణం
డీసీసీబీ బోర్డు సమావేశంలో నిర్ణయాలను వెల్లడించిన చైర్మన్

 
కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది జిల్లా సహకార కేంద్రబ్యాంకు ద్వారా అన్ని పథకాల కింద రూ.500 కోట్ల వరకు రుణాలు పంపిణీ చేయనున్నట్లుగా చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. బుధవారం కేడీసీసీబీ చైర్మన్ ఆధ్యక్షతన బోర్డు సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని ఆయన విలేకరులకు వివరించారు.  ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూన్ నెల మొదటి వారం నుంచి రుణాల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. ఖరీఫ్ సీజన్ మొదలు కానుండటంతో సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎరువుల వ్యాపారానికి గత ఏడాది వరకు బ్యాంకు గ్యారంటీ రూ.15 లక్షలకు ఇస్తుండగా ఈ ఏడాది దీనిని రూ. 25 లక్షలకు పెంచుతూ తీర్మనం చేసినట్లు తెలిపారు.

రైతులను అన్ని విధాలా అదుకునేందుకు కేడీసీసీబీ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు. గ్రాము బంగారంపై ఇప్పటి వరకు రూ.1500 రుణం ఇస్తున్నామని దీనిని రూ.1800 పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లా సహకారకేంద్రబ్యాంకులో రూ. 50 లక్షలు డిపాజిట్ చేస్తే వడ్డీ రేటు 9.50 శాతం ఇవ్వాలని తీర్మానించినట్లు తెలిపారు. మిగిలిన డిపాజిట్‌లపై 9.25 శాతం వడ్డీ రేటు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

త్వరలోనే ఏటీఎంలను అందుబాటులోకి తెచ్చి ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించనున్నామన్నారు. డీసీసీబీ ైవైస్ చైర్మన్ పదవీ ఖాళీగా ఉన్న విషయాన్ని జిల్లా సహకార అధికారి దృష్టికి తీసుకెల్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో సీఈవో రామాంజనేయులు, బ్యాంకు డెరైక్టర్‌లు ఆప్కాబ్ డీజీఎం విజయభాస్కరరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement