పోలీసుల కళ్లల్లో కారం కొట్టి పరార్ | Thieves sprinkle chilli powder in Police eyes | Sakshi
Sakshi News home page

పోలీసుల కళ్లల్లో కారం కొట్టి పరార్

Aug 23 2015 11:05 AM | Updated on Aug 30 2018 5:24 PM

మద్యం దుకాణంలో చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. అక్కడికి వెళ్లిన పోలీసుల కళ్లల్లో కారం కొట్టి దొంగలు పారిపోయారు.

చిలమత్తూరు (అనంతపురం జిల్లా) : మద్యం దుకాణంలో చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. అక్కడికి వెళ్లిన పోలీసుల కళ్లల్లో కారం కొట్టి దొంగలు పారిపోయారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా చితమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్ గ్రామసమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. కొడికొండ చెక్‌పోస్ట్ సమీపంలో ఉన్న బాలాజీ వైన్స్‌లో దొంగతనం చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే సరిగ్గా అదే సమయంలో అటుగా వచ్చిన గస్తీ పోలీసులు ఈ విషయాన్ని గమనించారు. దీంతో దుండగులు పోలీసుల కళ్లల్లో కారం కొట్టి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement