విజయవాడలో ఇద్దరు దొంగలను నగర పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
విజయవాడ : విజయవాడలో ఇద్దరు దొంగలను నగర పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 మోటర్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పోలీసులు సీజ్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. సదరు దొంగలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అందులోభాగంగా వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.