దొంగతనానికి వచ్చిన వ్యక్తిని చితకబాదడంలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
రాజమండ్రి రూరల్: దొంగతనానికి వచ్చిన వ్యక్తిని చితకబాదడంలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన రాజమండ్రిలోని రహమత్‌నగర్‌లో చోటుచేసుకుంది. స్థానిక న్యూ రాయల్స్ ట్రేడర్స్ ఐరన్ దుకాణంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించాడు. కొన్ని ఇనుప ముక్కలను దొంగలించుకు వెళ్లాడనే నెపంతో యజమాని సహా షాపు సిబ్బంది అతన్ని చితకబాదడంతో మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.