భోజనం కూడా పెట్టలేదు | There is no Meal Even | Sakshi
Sakshi News home page

భోజనం కూడా పెట్టలేదు

Oct 10 2016 2:20 AM | Updated on Sep 4 2017 4:48 PM

ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానంలో హజ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

- హజ్ యాత్రికులపై ఇండియన్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం
- ఉన్నతాధికారులకు హజ్ కమిటీ ఫిర్యాదు

 సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానంలో హజ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9.30 గంటలకు సౌదీ అరేబియా మదీనా నుంచి బయలుదేరిన విమానం మధ్యాహ్నం 3.40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. మధ్యాహ్నం కనీసం భోజనం కూడా ఇవ్వలేదని, షుగర్ పేషెంట్లు, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఉన్నప్పటికీ విమాన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని యాత్రికులు తెలిపారు.

ఈ విషయమై వారు ఎమ్మెల్సీ అహ్మద్ షరీఫ్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండీ లియాఖత్ అలీ ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజుకూ హజ్ కమిటీ ఫిర్యాదు చేసింది. పది విమానాల్లో హైదరాబాద్ చేరిన హజ్ యాత్రికుల్లో ఏపీకి చెందిన వారు 1,027 మంది ఉన్నారని లియాఖత్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement