పట్టు సడలని పోరు | The movement had reached the 39th day | Sakshi
Sakshi News home page

పట్టు సడలని పోరు

Sep 8 2013 2:36 AM | Updated on Mar 23 2019 7:56 PM

జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు మిన్నంటుతున్నాయి. ఉద్యమం 39వ రోజుకు చేరింది. ఊరూవాడా సమైక్య నినాదాలు హోరెత్తుతున్నాయి.

తిరుపతి, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు మిన్నంటుతున్నాయి. ఉద్యమం 39వ రోజుకు చేరింది. ఊరూవాడా సమైక్య నినాదాలు హోరెత్తుతున్నాయి. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలతో రహదారులను దిగ్బంధిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు మద్దతుగా పీలేరులో  శని వారం సంపూర్ణ బంద్ జరిగింది. వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, పైవేట్ విద్యాసంస్థలు. ప్రభుత్వ కార్యాలయాలు  స్వచ్ఛందంగా మూ తపడ్డాయి. హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదుల దాడిని నిరసిస్తూ పీలేరులో న్యాయవాదులు నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. రాజీవ్ విద్యామిషన్ ఇంజనీరింగ్ సిబ్బంది రిలే నిరాహార దీక్షలు 31వ రోజుకు చేరాయి. జిల్లా భట్రాజుల సంఘం ఆధర్యంలో సుమారు 5 వేలమంది భారీ ర్యాలీ నిర్వహించి వంటావార్పు చేపట్టారు. సమైక్యాంధ్ర నాటికను ప్రదర్శించారు.
   
హైదరాబాద్‌లో సీమాంధ్రవాసులపై దాడిని నిరసిస్తూ  తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. చిత్తూరులో జేఏసీ నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్‌కో ఉద్యోగులు ఈ నెల 12 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ప్రకటించి రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదులపై దాడిని నిరసిస్తూ న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు. చంద్రగిరిలో ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ రిలే నిరాహార  దీక్షలు 39వ రోజుకు చేరుకున్నాయి.

వ్యవసాయ శాఖ సిబ్బంది రోడ్డుపై మట్టిపోసి వరినాట్లు వేసి వినూత్న తరహాలో నిరసన తెలి పారు. శ్రీకాళహస్తిలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఏపీ సీడ్స్  కూడలిలో ధర్నా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెండ్లిమండపం కూడలి వద్ద రెవెన్యూ సిబ్బంది, బేరివారిమండపం వద్ద ఐకేపీ సంఘాల మహిళల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. బాబూ అగ్రహారం వద్ద ఉపాధ్యాయులు రోడ్డుపై ఆటపాట కార్యక్రమం నిర్వహించారు. పుత్తూరులో ఆర్టీసీ కార్మికులు చెవిలో పూలు పెట్టుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పుత్తూరు, నగరిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ రిలే దీక్షలు కొనసాగాయి.

హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదుల దాడిని నిరసిస్తూ పుంగనూరులో న్యాయవాదులు భారీ ర్యాలీ నిర్వహించి గోకుల్ సర్కిల్‌లో మానవహారం ఏర్పాటుచేసి రాస్తారోకో చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది, జేఏసీ రిలే దీక్షలు కొనసాగాయి. ఉపాధ్యాయులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట  బైఠాయించి ధర్నా చేశారు. విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. మదనపల్లెలో  జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మల్లికార్జున సర్కిల్‌లో మానవహారం ఏర్పాటు చేశారు.

విద్యార్థి జేఏసీ నాయకులు రెండు సినిమా థియేటర్ల వద్ద తుఫాన్ సినిమా వాల్‌పోస్టర్లను ధ్వంసం చేశారు. జేఏసీ రిలే దీక్షలు యథావిధిగా కొనసాగాయి. పలమనేరులో విద్యార్థులు రోడ్డుపై చదువులు సాగించి, సమైక్య నినాదాన్ని రామకోటి తరహాలో రాసి నిరసన తెలిపారు. న్యాయవాదులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. టీడీ పీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. జేఏసీ దీక్షలు కొనసాగాయి. వి.కోటలో 48 గంటల బంద్ కొనసాగింది. ఎలక్ట్రికల్,డిష్ యాంటెన్నా వ్యాపారులు ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేశారు.

గంగవరంలో ఉపాధ్యాయులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. బెరైడ్డిపల్లెలో ఉపాధ్యాయ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు కొనసాగాయి. కుప్పం నియోజకవర గం శాంతిపురంలో ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. హైస్కూల్ విద్యార్థులు మానవహారం ఏర్పాటుచేశారు. కుప్పం, శాంతిపురంలో జేఏసీ నిరాహార దీక్షలు కొనసాగాయి. మదనపల్లె రూర ల్, తంబళ్లపల్లె, పూతలపట్టు నియోజకవర్గాల్లో నిరసన కార ్యక్రమాలు జరిగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement