‘బెల్టు’ తీస్తాం | The illegal supply of alcohol | Sakshi
Sakshi News home page

‘బెల్టు’ తీస్తాం

Apr 5 2014 2:09 AM | Updated on Sep 2 2017 5:35 AM

జిల్లాలో విడతల వారీగా జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పురస్కరించుకుని బెల్టు షాపులపై పోలీసు శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది.

  • ఎన్నికల్లో మద్యం అక్రమ సరఫరా చేస్తే చర్యలు
  •  రౌడీషీట్లు కూడా తెరుస్తాం
  •  ఎస్పీ హెచ్చరిక
  •  మచిలీపట్నం క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో విడతల వారీగా జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పురస్కరించుకుని బెల్టు షాపులపై పోలీసు శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు మద్యాన్ని గ్రామాల్లో ఏరులుగా పారిస్తుండగా వాటిని అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అందుకోసం ఎస్పీ జె.ప్రభాకరరావు జిల్లాలో ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు.

    ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఇప్పటివరకు 80 మంది బెల్టుషాపుల నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బెల్టు దుకాణాల్లో మద్యం విక్రయాలకు పాల్పడుతున్న 80 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5,609 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా నాటుసారా, నల్లబెల్లాన్ని కాపుకాసి పట్టుకున్నారు. వీటితో పాటు అక్రమ మార్గంలో మద్యాన్ని తరలిస్తున్న ఆరు ఆటోలతో పాటు రెండు బైక్‌లను అదుపులోకి తీసుకున్నారు.
     
    మద్యం సరఫరా చేస్తే కేసులు తప్పవు : ఎస్పీ
     
    జిల్లాలో బెల్టుషాపులకు మద్యం సరఫరా చేసే బార్ యజమానులపై కూడా ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ జె.ప్రభాకరరావు తెలిపారు. అక్రమ మార్గంలో మద్యం సరఫరా చేస్తే సంబంధిత యజమానులపైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసులు కూడా తప్పవని స్పష్టం చేశారు. మద్యం సరఫరా విషయంలో ఒకటి, రెండు పర్యాయాలు పోలీసుల దృష్టిలో పడినవారిపై రౌడీషీట్లు తెరిచేందుకు వెనుకాడబోమని ఎస్పీ హెచ్చరించారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement