ఓటర్ల తుది జాబితా | The final list of voters | Sakshi
Sakshi News home page

ఓటర్ల తుది జాబితా

Apr 26 2014 1:42 AM | Updated on Sep 2 2017 6:31 AM

ఓటర్ల తుది జాబితా

ఓటర్ల తుది జాబితా

కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికల ఓటర్ల తుది జాబితాను కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు శుక్రవారం విడుదల చేశారు.

కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికల ఓటర్ల తుది జాబితాను కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు శుక్రవారం విడుదల చేశారు. జిల్లాలో ఈనెల 9వ తేదీన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొత్తగా 59,958 మంది ఓటు నమోదు చేసుకున్నారు. వీరిలో పురుషులు 29,023 మంది, మహిళలు 30,847, ఇతరులు 88 మంది ఉన్నారు.

విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో 14,665 మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. అత్యల్పంగా పామర్రు నియోజకవర్గంలో 624 మంది   నమోదు చేసుకున్నారు. నూతనంగా ఓటర్లుగా నమోదైన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

తిరువూరు 2,342, నూజివీడు 1,823, గన్నవరం 2,520, గుడివాడ 3,778, కైకలూరు 752, పెడన 1,320, మచిలీపట్నం 3,322, అవనిగడ్డ 636, పెనమలూరు 2,622, విజయవాడ వెస్ట్ 7,663, విజయవాడ సెంట్రల్ 10,120, మైలవరం 3,167, నందిగామ 2,185, జగ్గయ్యపేట 2,419 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరితో కలుపుకుని జిల్లాలో మొత్తం ఓటర్లు 33,37,071 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 16,58,639 మంది, మహిళలు 16,78,118, ఇతరులు 314 మంది ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement