పాము కాటుతో చిన్నారి మృతి | The child died of snake bite | Sakshi
Sakshi News home page

పాము కాటుతో చిన్నారి మృతి

Nov 14 2015 3:38 PM | Updated on Oct 22 2018 2:22 PM

నాగు పాము కాటు వేయడంతో ఓ చిన్నారి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయింది.

నాగు పాము కాటు వేయడంతో ఓ చిన్నారి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణంలోని గేదెలవానిపేటలో ఈ ఘటన జరిగింది. సిమ్మా యామిని (5) శనివారం ఉదయం నిద్రలేవ లేదు. దీంతో తల్లి రమ్య కదిలించి చూడగా మృతి చెందినట్టు తెలిసింది. సమీపంలోనే నాగుపాము కనిపించడంతో పాము కాటు వల్లే మృతి చెందినట్టు గుర్తించారు. పాములు పట్టే వ్యక్తిని పిలిపించి నాగు పామును పట్టించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement