‘మాట మార్చిన ముఖ్యమంత్రి’ | 'The chief minister changed the Commitment | Sakshi
Sakshi News home page

‘మాట మార్చిన ముఖ్యమంత్రి’

Sep 29 2013 4:28 AM | Updated on Mar 18 2019 7:55 PM

అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి అకస్మాత్తుగా మాట మార్చి సీమాంధ్ర ప్రాంతానికే సీఎంగా వ్యవహరిస్తున్నారని యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి అన్నారు.

 నల్లగొండ, న్యూస్‌లైన్ : అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి అకస్మాత్తుగా మాట మార్చి సీమాంధ్ర ప్రాంతానికే సీఎంగా వ్యవహరిస్తున్నారని యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి  అన్నారు. సీమాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలోని గడియారం సెంటర్‌లో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
 ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అనుచరులు  పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు తొలుత గడియారం కూడలిలో సీఎం దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కిరణ్ ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదన్నారు. అధిష్టానం వెంటనే అయన్ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారగోని యాదయ్యగౌడ్, దుబ్బ అశోక్‌సుందర్, ఊట్కూరి వెంకట్‌రెడ్డి, జేరిపోతుల లింగయ్యగౌడ్, అయ్యాడపు ప్రకాశ్‌రెడ్డి, పనస శంకర్‌గౌడ్, సురిగి మారయ్య, లతీఫ్, బాబ తదితరులు పాల్గొన్నారు.
 
 అపశ్రుతి
 సీఎం దిష్టిబొమ్మకు పెట్రోల్ పోసి నిప్పుపెట్టే సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో కొందరు కాంగ్రెస్ నాయకులు చిక్కుకున్నారు. సురిగి మారయ్య, మోహన్‌రెడ్డి తదితరులకు మంటలంటుకుని స్వల్పగాయాలయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత   నెలకొంది. నాయకులు, కార్యకర్తలు చెల్లాచెదురై ఎవరికి ఏ ప్రమాదం జరిగిందోనన్న భయాందోళనకు గురయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement