నెల్లూరు జిల్లా రాపూరు సమీపంలో రైల్వే లైను నిర్మాణానికి సేకరించిన స్థలంలో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను..
రాపూరులో గుడిసెల తొలగింపు - ఉద్రిక్తత
Feb 16 2016 1:01 PM | Updated on Sep 3 2017 5:46 PM
రాపూరు: నెల్లూరు జిల్లా రాపూరు సమీపంలో రైల్వే లైను నిర్మాణానికి సేకరించిన స్థలంలో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను మంగళవారం ఉదయం రెవెన్యూ, పోలీసు అధికారులు తొలగించారు. దాంతో బాధితులు రహదారిపై రాస్తారోకో చేస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 30 ఇళ్లను తొలగించారు. సంబంధిత స్థలాన్ని రైల్వే లైను నిర్మాణానికి సేకరించామని తెలిసినా కొందరు గుడుసెలు వేసుకున్నారని అధికారులు తెలిపారు.
Advertisement


