ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లిపోతున్న పాక్‌కు మరో ఇబ్బంది వచ్చి పడింది. UAE ఇచ్చిన $3 బిలియన్ డాలర్లు అప్పు పూర్తిగా తిరిగి చెల్లించాలని కోరడంతో ఎలా చెల్లించేది అనే సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఈ అప్పులు ఎలా చెల్లించేదని ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడిచమురు ధరల వల్ల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. ఇంతకాలంగా యూఏఈకి ఉన్న అప్పును పలు దపాలుగా పాకిస్థాన్ వాయిదా వేస్తో వచ్చింది అయితే ప్రస్తుతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పు చెల్లించాలని కోరడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయమై పాక్ ఆర్థిక శాఖ మంత్రి జౌరంగజేబ్ స్పందించారు. మేము సమకూర్చుకోవాల్సిన నిధులను ద్వైపాక్షిక మార్గాలు, రుణాల ద్వారా సమకూర్చుకునే యత్నం చేస్తున్నాం. అప్పు చెల్లించడానికి ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తున్నాం అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో యుఏఈకి ఉన్న అప్పును చెల్లిస్తామని స్పష్టం చేశారు . అయితే అప్పుకోసం చైనా,లేదా సౌదీ అరేబియాలను సంప్రదిస్తున్నారా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు పాక్ మంత్రి సమాధానం దాటవేశారు.
కాగా ప్రస్తుతం ప్రస్తుతం పాక్ వద్ద $ 16.4 బిలియన్ల విదేశీ మారక నిల్వలు ఉండగా అవి ఆ దేశ దిగుమతులకు మూడునెలల వరకూ సరిపోతాయని కథనాలు పేర్కొన్నాయి. అయితే పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఆదేశంలో లాక్ డౌన్ విధించారు. ఇంధన వినియోగం తగ్గించడం కోసం షాపింగ్ మాల్స్, బజార్లు అన్ని రాత్రి 8 గంటల వరకే క్లోజ్ చేసేలా ఆదేశాలిచ్చారు.


