వణికిపోతున్న విశాఖ మన్యం | Temperatures Dip Drastically in Visakhapatnamc Agency | Sakshi
Sakshi News home page

వణికిపోతున్న విశాఖ మన్యం

Nov 12 2019 8:42 AM | Updated on Nov 12 2019 8:55 AM

Temperatures Dip Drastically in Visakhapatnamc Agency - Sakshi

పాడేరులో దట్టంగా కురుస్తున్న పొగమంచు

సాక్షి, పాడేరు/అరకులోయ: విశాఖ ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలి తాకిడితో ప్రజలు వణికిపోతున్నారు. ఆర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తుంది. సోమవారం ఉదయం 9 గంటల వరకు మన్యంలో మంచు తెరలు వీడలేదు. పాడేరుకు సమీపంలోని మినుములూరు కేంద్ర కాఫీబోర్డు కార్యాలయం, అరకులోయ కాఫీబోర్డు వద్ద 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

శీతల ప్రాంతాలైన జి.కె.వీధి, చింతపల్లి, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో చలి తీవ్రత నెలకొంది. పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో ప్రధాన రోడ్లలో వాహన చోదకులు ఉదయం 8 గంటల వరకు వాహనాలకు లైట్లు వేసుకునే ప్రయాణిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు మంచు, చలితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement