
నా పార్టీ పేరు జనసేన: పవన్ కళ్యాణ్
తన పార్టీ పేరు 'జనసేన' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ప్రకటించారు.
హైదరాబాద్: గొప్పగా బతకాలని తానెన్నడూ ప్రయత్నం చేయలేదని, సామాన్యుడిలా బతకాలనుకున్నానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. తాను రాజకీయాల నుంచి మాట్లాడతానగానే తనను ఇష్టం వచ్చినట్టు తిట్టారని అందుకే పార్టీ పెట్టానని వెల్లడించారు. తన పార్టీ పేరు 'జనసేన' అని ప్రకటించారు. తన పార్టీ విధివిధానాలు తర్వాత వెల్లడిస్తానని చెప్పారు.
తాను పార్టీ పెడుతున్నట్టు తన కుటుంబ సభ్యుల్లో ఎవరికీ తెలియదన్నారు. పదవుల పట్ల తనకు వ్యామోహం లేదన్నారు. అన్నయ్య చిరంజీవిపై కోపం ఉండదన్నారు. తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యకు ఎదురెళ్లను అన్నారు. ఢిల్లీ వాళ్ల కాళ్లు పట్టుకునే బానిసను కాదన్నారు. పదవులపై తనకు మోజు లేదన్నారు. పదవులు నాకు చాలా తుచ్ఛమైనవి అన్నారు.