తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం | telangana tdp leaders met chandrababu niadu over latest updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం

Jun 20 2015 11:18 AM | Updated on Aug 11 2018 4:44 PM

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం - Sakshi

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. శనివారం ఉదయం చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో ఓటుకు కోట్లు సంబంధించి తాజా పరిణామాలను చర్చిస్తున్నట్టు సమాచారం. మొన్న ఏసీబీ విచారణకు హాజరయిన వేం నరేందర్‌ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

తెలంగాణలో పార్టీ పరిస్థితి, వరుసగా తలెత్తుతున్న ఇబ్బందులు, భవిష్యత్‌ వ్యూహాలపై చంద్రబాబు తెలంగాణ టిడిపి నేతలతో చర్చిస్తున్నట్టు తెలిసింది. వేం నరేందర్ రెడ్డితో పాటు గరికపాటి రాంమ్మోహన్రావు, ఎర్రబెల్లి దయాకరరావు, కంభంపాటి తదితరులు చంద్రబాబును కలిసినవారిలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement