టీచరమ్మకు మంత్రి యోగం

టీచరమ్మకు మంత్రి యోగం - Sakshi


చింతలపూడి, న్యూస్‌లైన్ :పదేళ్ల అనంతరం చింతలపూడి నియోజకవర్గానికి తిరిగి మంత్రి పదవి దక్కింది. ఎమ్మెల్యే పీతల సుజాతకు మంత్రి వర్గంలో స్థానం లభించింది. ఈ విషయం తెలియగానే టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చింతలపూడిలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. 2004లో టీడీపీ తరఫున ఆచంట నియోజకవర్గం నుంచి సుజాత తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఆచంట నియోజకవర్గం జనరల్‌కు కేటాయించడంతో ఆమె పోటీకి దిగలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి సుజాత దూసుకు వచ్చారు. చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ ఆమెను బరిలోకి దింపింది. 15,156 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన సుజాత మంత్రి పదవిని దక్కించుకున్నారు.

 

 ఉపాధ్యాయి.నిగా ప్రస్థానం

 ఆచంట: బెత్తం పట్టుకుని చిన్నారులకు అ ఆ..ఇ ఈలు నేర్పిన టీచరమ్మ పీతల సుజాతకు రాజకీయాల్లో ఓనమాలు తెలియకపోయినా అ నూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేశారు. రాజకీయ చదరంగంలో నెట్టుకొచ్చిన ఆమె ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఎదిగారు. పార్టీనే నమ్ముకున్న సుజాతకు అదృష్టం కూడా తోడైం ది. ఆచంట, చింతలపూడి  నియోజకవర్గాల నుంచి స్థానికేతరురాలిగానే బరిలోకి దిగిన ఆమె అనూహ్యంగా విజయం సాధించారు. జిల్లాలో మహిళా కోటాతోపాటు, దళితుల కోటా కలిసి రావడంతో సీమాంధ్ర తొలి కేబినెట్‌లో ఆమెకు అవకాశం దక్కింది. సుజాతకు మంత్రి పదవి రావడంతో ఆమెకు రాజకీయంగా జన్మనిచ్చిన ఆచంటలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారుు.

 

 స్థానికత్వం కలసి రాకపోయి.నా...

 1973 ఆగస్టు 13న వరప్రసాద్ (బాబ్జి), కృపావరం దంపతులకు జన్మించిన సుజాత ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేశారు. నరసాపురంలో కళాశాల విద్యను అభ్యసించారు. ఎంఏ బీఈడీ చదివి 2004లో ఉపాధ్యాయి.నిగా ఎంపికయ్యూరు. నరసాపురం మండలంలో పని చేశారు. ఆచంట ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం 2008లో సహ ఉపాధ్యాయుడు సురేష్‌కుమార్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి రణవీర్ అనే కుమారుడు ఉన్నాడు. ఆమె తండ్రి పీతల బాబ్జి టీడీపీలో చురుకైన కార్యకర్త. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి అనుచరుడు. 2004లో ఆచంట టీడీపీ సీటు కోసం బాబ్జి తన కుమార్తె పీతల సుజాతతో రిజర్వుడు నియోజకవర్గమైన ఆచంట నుంచి దరఖాస్తు చేయించారు.

 

 అయితే, తొలుత హైదరాబాద్‌కు చెందిన పీతల మహాలక్ష్మికి సీటు కేటాయించారు. మహాలక్ష్మిపై అభియోగాలు రావడంతో చివరి నిమిషంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చక్రం తిప్పి టికెట్‌ను పీతల సుజాతకు ఇప్పించారు. ఆచంట నుంచి పోటీచేసిన సుజాత 5,641 మెజార్టీతో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆమె ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో ఆమె పలుమార్లు ప్రస్తావించారు. కానీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా నేరవేర్చలేకపోయారు. అప్పట్లో కాంగ్రెస్ నాయకుల నుంచి నియోజకవర్గంలో అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. అయినా అధైర్యపడకుండా తనదైన శైలిలో రాజకీయాల్లో నెట్టుకొచ్చారు.

 

 2009 ఎన్నికల్లో ఆచంట నుంచి పోటీ చేసేందుకు సిద్ధం కాగా, నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఈ నియోజకవర్గం జనరల్ కేటగిరీలోకి వెళ్లింది. దీంతో ఆమె రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. 2009లో రిజర్వుడు నియోజకర్గమైన చింతలపూడి టికెట్ ఆశించినా ఫలితం దక్కలేదు. ఆయినా ఆమె పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఆమె సేవలను గుర్తించిన చంద్రబాబు మూడేళ్ల క్రితం రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శిగా నియమించారు. పార్టీపై విధేయత చూపడంతోపాటు.. సౌమ్యురాలిగా అందరి మన్నలు పొందారు. 2014 ఎన్నికలలోనూ అనూహ్యంగా చింతలపూడి టికెట్ సాధించి అనూహ్యమైన విజయం సాధించారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. ఎమ్మెల్యేగా గతంలో ఆచంట నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేకపోయిన సుజాత మంత్రిగా ఇకపై ఆచంట అభివృద్ధిపై దృష్టి సారించాలని ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

 

 జిల్లా నుంచి ఐదో మహిళ

 స్వాతంత్య్రానంతరం జిల్లా రాజకీయ చరిత్రలో కేబినెట్ ర్యాంకు పదవులను దక్కించుకున్న ఐదో మహిళగా పీతల సుజాత రికార్డులకెక్కారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర కేబినెట్‌లో మన జిల్లా కోడలు ఆచంట రుక్మిణమ్మ డెప్యూటీ స్పీకర్‌గా, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. జిల్లాకు చెందిన చోగడం అమ్మన్నరాజా కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో డెప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక అత్తిలి తొలి ఎమ్మెల్యే అమ్మన్నరాజా పార్లమెంటరీ సెక్రటరీగా వ్యవహరించారు. ఈ పదవి కూడా కేబినెట్ ర్యాంకుతో కూడినదే. ఆ తరువాత కాలంలో పెనుగొండ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున రెండుసార్లు ఎన్నికైన ప్రత్తి మణెమ్మ, కాంగ్రెస్ తరఫున దెందులూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాగంటి వరలక్ష్మి మంత్రి పదవులను అలకరించారు. ఆ పదవులకు వన్నె తెచ్చారు. జిల్లాకు చెందిన పీతల సుజాత సీమాంధ్ర తొలి కేబినెట్‌లో స్థానం సంపాదించడం ద్వారా అలనాటి మహిళామణుల సరసన నిలిచారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top