విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయిని | Teacher Beat Fourth Class Student in Kurnool SC MPP School | Sakshi
Sakshi News home page

విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయిని

Jan 3 2020 1:25 PM | Updated on Jan 3 2020 1:25 PM

Teacher Beat Fourth Class Student in Kurnool SC MPP School - Sakshi

గాయపడిన విద్యార్థి అబ్దుల్‌ జాకిర్‌

కర్నూలు, కొలిమిగుండ్ల: అవుకు పట్టణంలోని ఎస్సీ ఎంపీపీ పాఠశాలలో ఓ ఉపాధ్యాయిని విద్యార్థులను చితకబాదడంతో ఇద్దరు గాయపడ్డారు. పాఠశాలలో నాలుగో తరగతి అభ్యసిస్తున్న అబ్దుల్‌ జాకిర్, మేఘన అనే విద్యార్థులు అల్లరి చేస్తున్నారని ఉపాధ్యాయురాలు బెత్తంతో బాదడంతో విద్యార్థుల కాళ్లు, చేతులపై వాతలు పడ్డాయి. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయినితో వాగ్వాదానికి దిగారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మార్సీ సిబ్బంది అక్కడికి చేరుకుని తల్లిదండ్రులను శాంతింపజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement