అనంతపురం జిల్లాలో తెలుగు దేశం పార్టీ నేతల దౌర్జన్యం కొనసాగుతోంది.
అనంతపురం : అనంతపురం జిల్లాలో తెలుగు దేశం పార్టీ నేతల దౌర్జన్యం కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడుతున్నారు. కళ్యాణదుర్గం మండలం కొత్తూరులో వైఎస్ఆర్సీపీ కదిరప్పపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. మరోవైపు ఎన్సీకుంట మండలం జవకులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాబురెడ్డిపై దాడికి పాల్పడ్డారు. నల్లచెరువు మండలం గోళ్లవాండ్లపల్లిలో పార్టీ కార్యకర్త నర్సింహులుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
మరోవైపు తలుపుల మండలం ఇందుకూరుపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ కార్యకర్తలు కొడవళ్లతో దాడి చేయటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శివారెడ్డి గాయపడ్డాడు.