మహిళపై టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం | TDP women activists outrage | Sakshi
Sakshi News home page

మహిళపై టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం

May 9 2014 12:25 AM | Updated on Aug 10 2018 8:35 PM

మహిళపై టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం - Sakshi

మహిళపై టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం

వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దౌర్జన్యం చేసి దాడి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మునగపాక పోలీస్ స్టేషన్...

  •      వైఎస్సార్ సీపీ నేతల ఆందోళన
  •      పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
  •  మునగపాక, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దౌర్జన్యం చేసి దాడి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మునగపాక పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం ఆందోళన నిర్వహించారు.

    తిమ్మరాజుపేట గ్రామంలోని వైఎస్సార్ సీపీ కార్యకర్త కాండ్రేగుల జగన్ తల్లి లక్ష్మిని అదే గ్రామానికి చెందిన మళ్ల లక్ష్మిసాయిరాం, రామచంద్రరావు, భీమరశెట్టి బాలసుబ్రహ్మణ్య ం, శరగడం పరమేశ్వరరావు గురువారం ఉదయం అసభ్యంగా దూషించి, దౌర్జన్యం చేయడాన్ని నిరసిస్తూ మునగపాక పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మహిళపై దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు చర్యలు తీసుకోనట్టయితే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

    అనంతరం బాధిత మహిళ కాండ్రేగుల లక్ష్మి ఎస్‌ఐ జి.రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆందోళనలో పార్టీ నేతలు మళ్ల సంజీవరావు, సూర్యనారాయణ, శరగడం జగన్నాథరావు, మళ్ల సూరప్పారావు, బొడ్డేడ శ్రీనివాసరావు పాల్గొన్నారు. మరోవైపు టీడీపీ వర్గీయులు కూడా ప్రత్యర్థులపై ఫిర్యాదు చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement