సీఎం పార్టీ పెడితే టీడీపీకే నష్టం: శోభా నాగిరెడ్డి | TDP will loss, If kiran kumar reddy form a party, says Sobha Nagi reddy | Sakshi
Sakshi News home page

సీఎం పార్టీ పెడితే టీడీపీకే నష్టం: శోభా నాగిరెడ్డి

Jan 18 2014 5:00 AM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎం పార్టీ పెడితే టీడీపీకే నష్టం: శోభా నాగిరెడ్డి - Sakshi

సీఎం పార్టీ పెడితే టీడీపీకే నష్టం: శోభా నాగిరెడ్డి

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ పెడితే టీడీపీకే నష్టం జరుగుతుందని, తమ పార్టీపై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ పెడితే టీడీపీకే నష్టం జరుగుతుందని, తమ పార్టీపై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి అన్నారు.  కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళదామనుకుంటున్నవారు సీఎం పార్టీ పెడితే ఆగిపోతారని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ సీఎం వెంట వెళ్లరన్నారు.
 
 వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో ఆదరణ తగ్గుతోందని ఓ పత్రిక, చానల్‌లో వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. వారు మాబలం ఎంత పడి పోతుందని చెబితే అంత  ఎక్కువగా బలం ఉన్నట్లని అన్నారు. ఉప ఎన్నికలు జరిగినపుడు కూడా వైఎస్సార్‌సీపీ బలం తగ్గిపోయిందని అదే పత్రిక, చానల్ వార్తలు ప్రసారం చేశాయని.. కానీ ఫలితాలు ఎలా వచ్చాయన్నది అందరికీ తెలిసిందేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement