'అణా పైసలతో సహా మాఫీ చేయాలి' | TDP should fulfill crop loan waiver promise, says Ambati Rambabu | Sakshi
Sakshi News home page

'అణా పైసలతో సహా మాఫీ చేయాలి'

Jul 21 2014 6:12 PM | Updated on May 25 2018 7:29 PM

'అణా పైసలతో సహా మాఫీ చేయాలి' - Sakshi

'అణా పైసలతో సహా మాఫీ చేయాలి'

ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రైతులను నిట్టనిలువునా సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రైతులను నిట్టనిలువునా సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. అణా పైసలతో సహా వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన వాగ్దానానికి చంద్రబాబు కట్టుబడాలన్నారు. కమిటీలతో కాలయాపన చేయడమేనా రుణమాఫీ అంటే చంద్రబాబూ అని ప్రశ్నించారు.

రైతులు, వ్యవసాయం అంటే ప్రేమ లేదని చంద్రబాబు తీరుతో వెల్లడైందన్నారు. ప్రజలను మోసం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వాగ్దానానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.హామీని నిలుపుకోకుంటే చేతగాని సీఎంగా మిగిలిపోతారని అంబటి హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement