సీఎం 'వైఎస్‌ జగన్‌'ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే | TDP MLA Maddali Giridhara Rao Meets YS Jagan - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే

Dec 30 2019 4:55 PM | Updated on Dec 30 2019 7:05 PM

TDP MLA Maddali Giridhara Rao Meets CM YS Jagan - Sakshi

గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది.

సాక్షి, అమరావతి: గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు. భేటీ వివరాలు వెల్లడి కాలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను టీడీపీ ఎమ్మెల్యే గిరిధర్ రావు కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. శాసనసభలో తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి, సీటు కేటాయించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే సీఎం జగన్‌ను కలవడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. (ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి: వల్లభనేని వంశీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement