బతికుండగానే చంపేశారు! | TDP Leaders Cancelled YSRCP Supporters Ration Card In Anantapur | Sakshi
Sakshi News home page

బతికుండగానే చంపేశారు!

Jun 27 2018 8:52 AM | Updated on Aug 20 2018 6:07 PM

TDP Leaders Cancelled YSRCP Supporters Ration Card In Anantapur - Sakshi

లక్ష్మీదేవి పేరుతో ఉన్న రేషన్‌ కార్డు

కుందుర్పి:  వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తున్నారనే కక్షతో మండలంలోని ఎర్రగుంట గ్రామానికి చెందిన లక్ష్మీదేవికి చెందిన రేషన్‌కార్డును రద్దు చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కుందుర్పికి చెందిన లక్ష్మీదేవి, కుమారుడు రమేష్‌కు తెల్లరేషన్‌ కార్డు ఉంది. వీరు వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులు కావడంతో జన్మభూమి కమిటీ సభ్యులు కక్ష కట్టారు. మూడు నెలల క్రితం లక్ష్మీదేవి మరణించినట్లు రికార్డుల్లో నమోదు చేసి రేషన్‌కార్డులో పేరు తొలగించేశారు. దీంతో ఆమె పేరిట సరుకులు అందకుండా పోయాయి.

ఈ విషయంగా మూడు నెలలుగా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదులు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని రమేష్‌ వాపోతున్నారు. కలెక్టరేట్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వారు తహసీల్దార్‌ కార్యాలయంలో సమస్య పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తన తల్లి పేరిట కార్డును పునరుద్ధురించడంతో పాటు నిత్యావసర సరుకులు అందేలా చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement