‘లోకేశ్‌కు శిష్యుడి వర్ధంతి శుభాకాంక్షలు’ | TDP leader vard​​hanthi wishes to Lokesh | Sakshi
Sakshi News home page

‘లోకేశ్‌కు శిష్యుడి వర్ధంతి శుభాకాంక్షలు’

Jan 24 2019 4:14 PM | Updated on Jan 24 2019 5:03 PM

TDP leader vard​​hanthi wishes to Lokesh - Sakshi

మంత్రి నారా లోకేశ్‌కు తగ్గ శిష్యుడు దొరికాడంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది.

సాక్షి, హైదరాబాద్‌ : మంత్రి నారా లోకేశ్‌కు తగ్గ శిష్యుడు దొరికాడంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. హైటెక్‌ ముఖ్యమంత్రినని చెప్పుకునే చంద్రబాబుకు కొడుకుగా తొలినుంచీ సోషల్‌ మీడియాలోదూసుకుపోతున్న లోకేశ్‌పై అదే స్థాయిలో విమర్శలు, జోకులు పేలుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన అభిమాని ఒకరు చేసిన ప్రసంగం వైరల్‌గా మారింది. బుధవారం లోకేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ నాయకులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. అయితే ఓ టీడీపీ నాయకుడు మాట్లాడుతూ.. నారా లోకేశ్‌ గారికి 36వ వర్ధంతి శుభాకాంక్షలు అని ఆ తర్వాత వెంటనే పక్కన వాళ్లు అందిస్తే సవరించుకున్నాడు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా బిగ్గరగా నవ్వారు. 

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవ్వడంతో.. అంబేద్కర్‌ జయంతినాడు వర్ధంతి శుభాకాంక్షలు చెప్పిన లోకేశ్‌ను గుర్తు చేసుకుని గురువుకు తగ్గా శిష్యుడు అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా శ్రద్ధాపూర్వకంగా అనే బదులు శ్రద్ధాంజలి అంటూ లోకేశ్‌ తడబడ్డారు. ఓ టీడీపీ కార్యక్రమంలో బంధుప్రీతి, మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే అంటూ టంగ్‌ స్టిప్‌ అయ్యారు. పొరపాటున కూడా సైకిల్‌ గుర్తుకు ఓటేస్తే మనల్ని మనం ఉరి తీసుకున్నట్టే అంటూ నోరుజారారు. ఇప్పటికే మంత్రి హోదాలో బహిరంగ వేదికలపై మాట్లాడుతూ.. ‘మంచి నీటి సమస్య కల్పన..’, ‘వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు..’ లాంటి వ్యాఖ్యలు చేసిన నారా లోకేశ్‌పై సోషల్‌ మీడియాలో వ్యక్తమైన అభిప్రాయాలు అందరికీ తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement