మీ ఇష్టమే.. మా ఇష్టం...

మీ ఇష్టమే.. మా ఇష్టం... - Sakshi


మీరు చూసిన సంబంధమే చేసుకుంటాం. మీ ఇష్టమే మా ఇష్టం.... వివాహాల విషయంలో గతంలో ఎక్కువగా యువతీయువకుల నోటివెంట ఈ మాటలు తల్లిదండ్రుల వద్ద వినబడేవి. కాలం మారింది. జీవిత భాగస్వాముల ఎంపికలో యువత తమకు తామే స్వంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వచ్చింది. తమకు నచ్చిన వారిని పెద్దలను ఎదరించైనా పెళ్లిచేసుకునే జంటలు పెరుగుతున్నాయి. మారిన కాలంతో పాటు పిల్లల ఇష్టానికే తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు.



కాలం ఎంతమారినప్పటికీ వివాహం విషయంలో తల్లిదండ్రుల మాటే తమ బాటగా భావిస్తున్నారు యువతలో ఎక్కువ మంది. తమ జీవిత భాగస్వామి ఎంపిక విషయం ఎక్కువ మంది తల్లిదండ్రులకే వదిలేస్తున్నారు. షాది డాట్కామ్ పోర్టల్ నిర్వహించిన సర్వేలో ఈ వియషం వెల్లైడైంది. భాగస్వామి ఎంపికలో ఉత్తమైన మార్గం ఏమిటని ప్రశ్నించగా అత్యధికంగా 50.1 శాతం మంది తల్లిదండ్రులు చూసిన సంబంధానికే ఓటు వేశారు. తమిష్ట ప్రకారం ఆన్లైన్ లో భాగస్వామిని వెతుక్కుంటామని 31 శాతం మందిపైగా పేర్కొన్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా సంబంధం కలుపుకుంటామని 12 శాతం మంది, పనిచేసే కార్యాలయాల్లోనే భాగస్వామిని వెతుక్కుంటామని 6 శాతం మంది వెల్లడించారు.



జీవిత భాగస్వామి ఎంపికలో అభిప్రాయాలు, అభిరుచులకే ప్రాధాన్యం ఇస్తామని అధికంగా 37 శాతం మంది తెలిపారు. విద్యార్హతలకు ప్రాధాన్యం ఇస్తామని 30 శాతం మంది, జీవిత భాగస్వామి వృత్తికి ప్రాధాన్యం ఇస్తామని 21 శాతం మంది పేర్కొన్నారు. ఆకర్షణీయంగా ఉండాలని 11 శాతం మంది చెప్పారు. తరాలు మారినా, టెక్నాలజీ పెరిగినా భారత యువత పెద్దలను గౌరవిస్తోందని, అదే సమయంలో తమ అభిప్రాయాలను కాపాడుకుంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top