ప్రజల శ్రేయస్సు కోసం ఎన్ని కేసులనైనా తాను భరిస్తానని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు.
ప్రజల శ్రేయస్సు కోసం ఎన్ని కేసులనైనా తాను భరిస్తానని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. చట్టాన్ని గౌరవించి తాను పోలీసులకు లొంగిపోతున్నట్లు ఆయన తన అనుచరులకు చెప్పారు. కర్నూలు మునిసిపల్ కార్యాలయంలో జరిగిన చిన్న వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాయత్నం కేసు పెట్టిన విషయం తెలిసిందే. భూమా ఇంటిచుట్టూ భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.
ఆయన లొంగిపోనున్నట్లు చెప్పడంతో.. నంద్యాలకు భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, ఐజయ్య, మణిగాంధీ తదితరులు ఇప్పటికే నంద్యాలకు చేరుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయ సాయిరెడ్డి కూడా కాసేపట్లో నంద్యాలకు చేరుకుంటారు.