రాలిపోతున్న పండుటాకులు | sunstroke effect | Sakshi
Sakshi News home page

రాలిపోతున్న పండుటాకులు

May 28 2015 2:44 AM | Updated on Sep 3 2017 2:47 AM

వడదెబ్బకు పండుటాకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రోజులుగా ప్రచండ భానుడి తాపానికి వృద్ధులు తట్టుకోలేక కన్నుమూస్తున్నారు.

నాయుడుపేటటౌన్ : వడదెబ్బకు పండుటాకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రోజులుగా ప్రచండ భానుడి తాపానికి వృద్ధులు తట్టుకోలేక కన్నుమూస్తున్నారు. వందలాది మంది వృద్ధులు విపరీత ఉష్ణోగ్రత కారణంగా చనిపోయారు. విన్నమాల గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ కురుప్పుస్వామి కళాయప్పన్(50), నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ కల్లూరు ఢిల్లీ ప్రసాద్(42), ఆంధ్రాబ్యాంకు వీధిలో నివాసముంటున్న షేక్ చెహతాబీ (70)చనిపోయారు.

 కావలిఅర్బన్: కొత్తసత్రం పంచాయతీలో కాటంగారి పార్వతయ్య(55), గొట్టిపాటి ప్రసాద్(58), గాయత్రినగర్‌లోని ఎస్‌కె నిజిమిని(71) వడదెబ్బతో చనిపోయారు.
 బుచ్చిరెడ్డిపాళెం: ఖాజానగర్‌కు చెందిన ఫాతిమాబీ(80), కట్టుబడిపాళేనికి చెందిన షేక్. మస్తాన్‌బీ(68), పగడాల లలిత(69) వడదెబ్బతో చనిపోయారు.
 జలదంకి: పోలిశెట్టి చిన మాలకొండయ్య (82 ),   యాటగిరి సుబ్బారావు ( 55 ) , గట్టుపల్లికి చెందిన దివి తులశమ్మ ( 75 ) మృతిచెందారు.

 నెల్లూరు(బారకాసు) :  దేవరపాళెంకు చెందిన ఎగ్గోలు పెంచలయ్య(43), శ్రీలంకకాలనికి చెందిన కమలమ్మ(55), అంబాపురానికి చెందిన తాటిపర్తి రమణమ్మ(69) మృతి చెందారు.
 సైదాపురం: ఊటుకూరు గ్రామానికి చెందిన ముత్యాల బాబయ్య, ఆదూరుపల్లి గ్రామానికి చెందిన అమ్మినేని రాజమ్మ (67), గిద్దలూరు గ్రామానికి చెందిన మల్లవరపు అదెమ్మ(70) వడదెబ్బతో చనిపోయారు.
 దొరవారిసత్రం: శింగనాలత్తూరు గ్రామానికి చెందిన మీజూరు నాగమ్మ(63), వెదురుపట్టు గ్రామం చెందిన చిలకల వెంకటయ్య(61) వడదెబ్బతో మృతిచెందారు.

 కోట: కోట తూర్పువీదికి చెందిన పురిణి లక్ష్మమ్మ(60), కొక్కుపాడు చెందిన వెంకటేశ్వర్లు(61) వడదెబ్బకు గురై చనిపోయారు.
 వరికుంటపాడు: ఇస్కపల్లి గ్రామంలో డబ్బుగొట్టు చిన్నమాలకొండయ్య (75), చిన్నక్క(70) వడదెబ్బతో చనిపోయారు.
 గూడూరు టౌన్: తూర్పువీధికి చెందిన నాగబోతు వెంకట శేషమ్మ(80),  చెన్నూరు గమళ్ళపాళెంకు చెందిన గీత కార్మికుడు బట్టికాల సెల్వరాజ్(55) చనిపోయారు.

 పొదలకూరు:  అగచాట్లపురంలో నివాసం ఉంటున్న లక్కు వెంకటరాజా(47) బుధవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు.
 కొడవలూరు: నార్తురాజుపాలెంలో చౌకచర్లకు చెందిన ఎల్లు వెంకయ్య(46) చనిపోయారు.
 ఉదయగిరి: కుర్రపల్లి బీసీ కాలనీకి ఇ.బ్రహ్మయ్య(60) వడదెబ్బ తగిలి చనిపోయాడు.
 బాలాయపల్లి: సుబ్రమణ్యం గ్రామానికి చెందిన బొల్లినేని రమాదేవి(46),నిడిగల్లు గ్రామం చెందిన పద్మమ్మ(73) చనిపోయారు.
 దుత్తలూరు: తురకపల్లికి చెందిన అంకినపల్లి ఈశ్వరమ్మ(69) వడదెబ్బతో చనిపోయింది.

 రాపూరు: తూమాయి గ్రామానికి చెందిన మార్కాపురం రాగయ్య(48) చనిపోయారు.
 దగదర్తి: కొత్తూరులో కడియాల చెంచమ్మ (75) వడదెబ్బకు గురై చనిపోయింది.
 వెంకటగిరిటౌన్:బీసీకాలనీకి చెందిన గజ్జల కృష్ణమ్మ (70) చనిపోయింది.
 అర్లపాడు(పెళ్లకూరు): గ్రామానికి చెందిన చిన్నపెంచలయ్య(55) వడదెబ్బతో మృతి చెందాడు.
 ఆత్మకూరు: సత్రం సెంటర్లో చేవూరు సుశీలమ్మ (80) చనిపోయింది.

 డక్కిలి:మాటుమడుగు గ్రామానికి చెందిన పిల్లి శంకరమ్మ (67) వడదెబ్బతో మృతిచెందింది.
 మనుబోలు:యాచవరం గ్రామానికి చెందిన చల్లా లక్ష్మమ్మ(65) మృతి చెందింది.
 చిట్టమూరు:గునపాడు గ్రామానికి చెందిన దేశిరెడ్డి బాలకృష్ణారెడ్డి(80) చనిపోయాడు.
 చేజర్ల: మడపల్లి గ్రామానికి చెందిన వంటేరు నాగరాజు (54), నాగులవెలటూరులో మాలేటి ఆదెమ్మ వడదెబ్బతో మృతి చెందారు.
 గూడూరు టౌన్: మహాలక్ష్మమ్మవీధికి చెందిన అంతోటి రమణయ్య(65) మరణించారు.

 నెల్లూరు(క్రైమ్): ఇందిరానగర్‌లో రామలింగం కనకమ్మ(70), ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన కాంతమ్మ, మహేంద్ర షోరూం వద్ద యాచకురాలు (70) మృతిచెందారు.
 కావలిఅర్బన్: ముసునూరులో మంద పిచ్చమ్మ(70) వడదెబ్బతో మృతి చెందింది.
 చిల్లకూరు: ఎస్సీ కాలనీకి చెందిన భూపయ్య(60) చనిపోయాడు.
 వరికుంటపాడు:పెద్దిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన సుబ్బమ్మ (72) చనిపోయింది.
 ఇందుకూరుపేట:కుడితిపాలెం గ్రామానికి చెందిన రాసాని పోలయ్య(60) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement