బొబ్బిలిలో ‘టైగర్’! | Sundeep Kishan's Tiger movie shooting in bobbili | Sakshi
Sakshi News home page

బొబ్బిలిలో ‘టైగర్’!

Dec 19 2014 2:00 AM | Updated on Sep 15 2019 12:38 PM

బొబ్బిలిలో ‘టైగర్’! - Sakshi

బొబ్బిలిలో ‘టైగర్’!

సందీప్ కిషన్ హీరోగా, సీరత్ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘టైగర్’ సినిమా క్లైమాక్స్‌ను చారిత్రక బొబ్బిలి రాజుల గెస్టుహౌస్‌లో చిత్రీకరిస్తున్నారు

 బొబ్బిలి: సందీప్ కిషన్ హీరోగా, సీరత్ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘టైగర్’ సినిమా క్లైమాక్స్‌ను చారిత్రక బొబ్బిలి రాజుల గెస్టుహౌస్‌లో చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మురుగదాసు వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఎ న్వీఆర్ సినీ పిక్చర్ బ్యానర్‌పై ఠాగూర్ మధు, ప్రసాద్‌లు చిత్రా న్ని నిర్మిస్తున్నారు. సినిమాలో విలన్‌గా నటిస్తున్న దొర్తె, ముం బైకి చెందిన బాబీలపై సన్నివేశాలను సినిమాటోగ్రాఫర్ చోటా.కె.నాయుడు గురువారం తీశారు. సినిమాలో టీవీ నటుడు కల్కి రాజ్ ప్రధాన పాత్ర పోషిస్తుండడం విశేషం. మరో ఐదు రోజులు ఇక్కడే షూటింగ్ నిర్వహిస్తారు. సినిమా నిర్మాణానికి, లోకేషన్ పరంగా బొబ్బిలి చాలా బాగుందని, ఇక్కడ తీసిన ప్రతి సినిమా విజయవంతం అవుతుందని వారు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement