టీటీడీలో రాజుకున్న మరో వివాదం..  | Sakshi
Sakshi News home page

టీటీడీలో రాజుకున్న మరో వివాదం.. 

Published Wed, May 23 2018 7:34 PM

Sundara Rama Deekshitulu Letter To TTD EO Anil Singhal - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో మరో వివాదం మొదలైంది. ఇటీవల ప్రధాన అర్చుకులు రమణ దీక్షితులును తొలగించడం, టీటీడీలో విలువైన సొత్తు మాయం అంటూ గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రధాన అర్చకులుగా వేణుగోపాల్‌ దీక్షితులును నియమించి టీటీడీ నిబంధనలు ఉల్లంఘించిందంటూ తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై టీటీడీ ఈవో అనిల్‌ సింఘాల్‌కి గొల్లపల్లి వంశ అనువంశిక అర్చకుడు ఏఎస్‌ సుందరరామ దీక్షితులు లేఖ రాశారు. కాగా, గొల్లపల్లి వంశీకులతో సంప్రదింపులు చెయ్యకుండానే టీటీడీ నిర్ణయం తీసుకుందన్నారు. నేటికి కూడా తమకిచ్చే సంభావనలో టీటీడీ రికవరీ చేస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

గొల్లపల్లి వంశంలో రమణ దీక్షితులు తర్వాత సీరియర్‌ని తానేనని ఏఎస్‌ సుందరరామ దీక్షితులు వాదిస్తున్నారు. దీంతో ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులును తొలగించిన స్థానంలో తనను నియమించాలని విజ్ఞప్తి చేశారు. రమణ దీక్షితులు తర్వాత వయసు దృష్ట్యా పూర్వపు మిరాశీదారుగా తనకు అవకాశం ఇవ్వాలన్నారు. కానీ తనను పరిగణనలోకి తీసుకోకుండా, మరొకరికి ప్రధాన అర్చక పదవి ఇచ్చి తనకు తీవ్ర అన్యాయం చేశారని ఏఎస్‌ సుందరరామ దీక్షితులు తన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement