పెట్టుబడులకు ఏపీ అనుకూలం | Suitable for investment AP | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు ఏపీ అనుకూలం

Jan 23 2015 2:57 AM | Updated on Aug 15 2018 2:20 PM

పెట్టుబడులకు ఏపీ అనుకూలం - Sakshi

పెట్టుబడులకు ఏపీ అనుకూలం

ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనమిక్ ఫోరం-డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

పరిశ్రమల స్థాపనకు ముందుకు రండి  పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు
 
హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనమిక్ ఫోరం-డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలమని వివరిస్తూ.. పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, ఖనిజ సంపద, జలవనరుల లభ్యత, రవాణా సదుపాయాలు, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా తదితర అంశాల గురించి వివరించారు. పట్టణాభివృద్ధిపై నిర్వహించిన సదస్సులో చ్రందబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ దేశాల ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంగా విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీ గా రూపొందించేందుకు సహకారమందిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హామీ ఇవ్వడాన్ని గుర్తుచేశారు. తిరుపతి, విజయవాడలతోపాటు జిల్లాకో స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని, గ్రిడ్లు, వివిధ మిషన్లద్వారా మౌలిక వసతులు పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నట్టు ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
 
భేటీలు సాగిందిలా..

 రాయల్ ఫిలిప్స్ సీఈవో ఫ్రాన్స్ వ్యాన్‌హటన్, మహీంద్రా అండ్ మహీంద్రా ప్రతినిధి అనీష్ షా, లులూ గ్రూప్ ఎండీ యూసుఫ్‌ఆలీ, సంస్థ ప్రతినిధులు షంషేర్ వేయల్లీ, అదీబ్ అహ్మద్, ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కాలతో సమావేశైమై రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం కోరారు.ళీఇస్పాత్ ఎండీ వినీత్ మిట్టల్‌తో సమావేశమైన చంద్రబాబు కడప జిల్లాలో ఏర్పాటు చేయబోయే ఉక్కు పరిశ్రమ గురించి చర్చించారు.ళీబుధవారం పొద్దుపోయాక చంద్రబాబు గ్లోబల్ వాటర్ డెవలప్‌మెంట్ పార్టనర్స్ సీఈవో ఉషారావుతో సమావేశమై సమీకృత జలవనరుల నిర్వహణ, కరువు నిర్వహణ, వ్యర్థజలాల నిర్వహణ, రాజధానిలో జల నిర్వహణ, విద్యుత్, రవాణా, బిందుసేద్యం గురించి చర్చించారు.

గ్లోబల్ ఎజెండా కౌన్సిల్ ఆన్ ఇండియా సభ్యులతో భేటీలో.. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. మరోసారి అబుధాబీలో ఏపీ అధికారులతో సమావేశం కావాలని తీర్మానించారు.

చంద్రబాబుతో సమావేశమైన భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా ఎన్ కల్యాణీ  రక్షణ రంగంలో ముఖ్యంగా మిస్సైల్స్ తయారీరంగం, పవన విద్యుత్ తయారీ పరికరాల ఉత్పత్తి, ఆటోమొైబె ల్ యూనిట్ స్థాపన పట్ల ఆసక్తి వెలిబుచ్చారు.

ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని అనుకూల అంశాలను చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా స్పానిష్ ప్రతినిధులు తమ దేశంలో పర్యటించాలంటూ బాబును ఆహ్వానించారు. స్విస్ సోలార్ టెక్నాలజీ కన్సార్టియంతోనూ సీఎం భేటీ అయ్యారు.

మలేషియా ప్రధానితో భేటీ

దావోస్ పర్యటనలో మలేషియా ప్రధాని నజీబ్ రజాక్‌తో బాబు గురువారం సమావేశమయ్యారు. ఆయిల్‌పామ్, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై ప్రతిపాదనలు పంపితే పరిశీలించేందుకు మలేషియా  బృందాన్ని పంపిస్తామని రజాక్ చెప్పారు.
 
స్వైన్‌ప్లూపై చంద్రబాబు ఆరా..

 ఆంధ్రప్రదేశ్‌లో స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలపై దావోస్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్‌తో గురువారం ఫోన్‌లో మాట్లాడారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement