సక్సెస్‌ మంత్ర ఎంతో ఉపయోగం | Success Mantra Orientation Classes Conducted | Sakshi
Sakshi News home page

సక్సెస్‌ మంత్ర ఎంతో ఉపయోగం

Apr 9 2018 8:01 AM | Updated on Apr 9 2018 8:01 AM

Success Mantra Orientation Classes Conducted - Sakshi

మాట్లాడుతున్న స్టెప్‌ సీఈఓ డాక్టర్‌ బి.రవి

ఒంగోలు : పదో తరగతి పూర్తి చేసి ఇంటర్‌లో చేరబోయే విద్యార్థులకు బ్రిలియంట్‌ సంస్థ రూపొందించిన సక్సెస్‌ మంత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని స్టెప్‌ సీఈఓ డాక్టర్‌ బి.రవి అన్నారు. ఆదివారం స్థానిక బ్రిలియంట్‌ కంప్యూటర్స్‌ సంస్థ ఆవరణలో బ్రిలియంట్‌ సంస్థ నిర్వహించిన సక్సెస్‌ మంత్ర వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సక్సెస్‌ మంత్ర పేరుతో రూపొందించిన టెక్‌–10 విద్యార్థుల జీవితాలను మలుపు తిప్పుతుందన్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌ ఎక్కువుగా జరుగుతున్నందు వల్ల ఇటువంటి వర్క్‌షాప్‌లు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. బ్రిలియంట్‌ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ షేక్‌ న్యామతుల్లాబాషా మాట్లాడుతూ తమ సంస్థ విద్యార్థులకు వేసవిలో ఈ ఏడు అందించే అదనపు ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నామన్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ లైఫ్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంకు ఆథరైజ్డ్‌ సెంటర్‌ అని, ఈ ప్రోగ్రాంలో పదో తరగతి ఆపై విద్యార్థులకు వ్యక్తిత్వ, విద్యా సంబంధ విషయాల్లో  విశ్వ విద్యాలయ ప్రొఫెసర్లచే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం ద్వారా విద్యార్థులు చిన్నవయస్సులలోనే యూనివర్శిటీ సర్టిఫికేట్‌ను పొందడమే గాక  తమ కెరీర్‌ ఎలా మలుచుకోవాలి, సమాజం , తల్లిదండ్రులపై బాధ్యతగా ఎలా ఉండాలి అనే అంశాలు పూర్తిగా ఉచితంగా నేర్పడం జరుగుతుందన్నారు.  కార్యక్రమంలో భాగంగా వచ్చే ఆదివారం పదో తరగతి, ఇంటర్‌ పూర్తయిన విద్యార్థినీ విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌పై ఉచిత వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర అదనపు డీజీపీ కిషోర్‌కుమార్‌ తదితర అనుభవజ్ఞులు హాజరై మార్గదర్శకం చేస్తారన్నారు. అనంతరం సక్సెస్‌ మంత్ర అంశంపై నేషనల్‌ ట్రైనర్‌ రవికాంత్‌ హాజరైన విద్యార్థులకు అవగాహన కల్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement