డాక్టర్ పి. సుబ్రమణ్యం సేవలు మరువలేనివని సుబ్రమణ్యం మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య అన్నారు.
వెంకటాచలం : డాక్టర్ పి. సుబ్రమణ్యం సేవలు మరువలేనివని సుబ్రమణ్యం మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఐఏస్‌అధికారి సుబ్రమణ్యం వర్ధంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకున్నారు.
వెంకటాచలం మండలంలోని చెముడుగుంట పంచాయతీలో సుబ్రహ్మణ్యం ఘాట్ వద కుటుంబసభ్యులు, అభిమానులు, స్నేహితులు నివాళులు అర్పించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో మ్యాగీ సుబ్రమణ్యం, బేబి సంహిత, సధర్మ, డాక్టర్ కోటేశ్వరమ్మ, తిరుపయ్య,సుధాకర్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.