అమరావతి గ్రామాల్లో దళితుల పట్ల వివక్షతపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ విచారణ చేపట్టారు.
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో దళితుల పట్ల వివక్షతపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ విచారణ చేపట్టారు. ల్యాండ్ పూలింగ్, లంక అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డులను 10 రోజుల్లోగా అందజేయాలని సీఆర్డీఏ కమిషన్ శ్రీధర్, గుంటూర్ జేసీ శుక్లాలను కమలమ్మ ఆదేశించారు.
సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, గుంటూర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శుక్లా హాజరుకాగా, హాజరుకాని రెవెన్యూ, సోషల్ వెల్ఫేర్ అదికారులపై కమలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత రైతులపై ఎందుకు వివక్షత చూపుతున్నారంటూ అధికారులను ఆమె ప్రశ్నించారు. కమిషన్ సభ్యురాలు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేదని సమాచారం. ప్రజల కోసం రాజధాని నిర్మించాలని, అప్పుడే అది ప్రజా రాజధాని అవుతుందని అధికారులకు కమలమ్మ సూచించారు.