ఇద్దరు విద్యార్థుల గల్లంతు | students missing in sarada river | Sakshi
Sakshi News home page

ఇద్దరు విద్యార్థుల గల్లంతు

Oct 14 2015 12:24 PM | Updated on Nov 9 2018 4:45 PM

మునగపాక మండలం గణపర్తి వద్ద బుధవారం ఉదయం శారదానదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు.

విశాఖపట్నం : మునగపాక మండలం గణపర్తి వద్ద బుధవారం ఉదయం శారదానదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు తూచకొండ గ్రామానికి చెందిన సాయి(14), మణికంఠ(13) లుగా గుర్తించారు.

ఉదయం 9 గంటలకు నదిలో స్నానానికి దిగారు. వీరిద్దరికీ ఈత రాకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో సాయి మృతదేహం బయటపడింది. మణికంఠ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. విద్యార్థుల మృతితో వాళ్ల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement