'నారాయణ కాలేజీ' ఘటనపై సత్తెనపల్లిలో నిరసన | Students conduct rally against students death in Narayana college | Sakshi
Sakshi News home page

'నారాయణ కాలేజీ' ఘటనపై సత్తెనపల్లిలో నిరసన

Aug 18 2015 5:40 PM | Updated on Nov 9 2018 4:51 PM

కడప నారాయణ కళాశాలలో విద్యార్థుల మృతికి నిరసనగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో విద్యార్థినులు నిరసన తెలిపారు.

సత్తెనపల్లి (గుంటూరు) : కడప నారాయణ కళాశాలలో విద్యార్థుల మృతికి నిరసనగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో విద్యార్థినులు నిరసన తెలిపారు. మంగళవారం పట్టణంలోని ప్రైవేటు కళాశాలలకు చెందిన బాలికలు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

విద్యార్థుల మృతిపై న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుమారు 300 మంది విద్యార్థినులు తాలూకా సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement