హోదా కోసం విద్యార్థుల మానవహారాలు

Student Unions Agitations For Special Category Status  - Sakshi

అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా13 జిల్లాల్లో మానవహారాలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ మానవహరాల్లో సుమారు కోటి మంది విద్యార్థులు పాల్గొన్నారని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ప్రత్యేక హోదాను వెంటనే ఇవ్వాలని, హోదా ఇస్తేనే విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్యాకేజీకి ఒప్పుకుని చంద్రబాబు విద్యార్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హోదాపై చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేసినట్లే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.

కృష్ణా జిల్లా
 నందిగామలో ప్రత్యేక హోదా కోరుతూ  గాంధీ సెంటర్లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థులకు మద్య వాగ్వివాదం జరిగింది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వైఎస్సార్ జిల్లా

కడప కోటిరెడ్డి సర్కిల్లో విద్యార్థుల భారీ మానవహారం ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా, కడప ఉక్కు కోసం విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ స్టూడెంట్‌ యూనియన్‌, ఏఐఎస్‌ఎఫ్‌, జనసేన విద్యార్థి విభాగం, ఎస్‌ఎఫ్‌ఐ తదితర సంఘాలకు చెందిన విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. కాసేపయిన తర్వాత విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి మానవహారాన్ని పోలీసులు భగ్నం చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా 
ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విధ్యార్ధి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మానవాహారం. భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్ధులు.

చిత్తూరు జిల్లా

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద విద్యార్థుల మానవహారం.

విజయనగరం జిల్లా

పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద విద్యార్ధి యువజన సంఘాల ఆధ్వర్యంలో మానవహారం. దీనికి సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలు మద్దతు తెలిపాయి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ నిరసన తెలిపారు.

నెల్లూరు జిల్లా

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ నెల్లూరు నగరం మాగుంట సర్కిల్లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో మానవహారం. హోదా కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top