breaking news
manavaharalu
-
హోదా కోసం విద్యార్థుల మానవహారాలు
అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా13 జిల్లాల్లో మానవహారాలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ మానవహరాల్లో సుమారు కోటి మంది విద్యార్థులు పాల్గొన్నారని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ప్రత్యేక హోదాను వెంటనే ఇవ్వాలని, హోదా ఇస్తేనే విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్యాకేజీకి ఒప్పుకుని చంద్రబాబు విద్యార్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హోదాపై చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేసినట్లే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామలో ప్రత్యేక హోదా కోరుతూ గాంధీ సెంటర్లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థులకు మద్య వాగ్వివాదం జరిగింది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్ జిల్లా కడప కోటిరెడ్డి సర్కిల్లో విద్యార్థుల భారీ మానవహారం ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా, కడప ఉక్కు కోసం విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్, ఏఐఎస్ఎఫ్, జనసేన విద్యార్థి విభాగం, ఎస్ఎఫ్ఐ తదితర సంఘాలకు చెందిన విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. కాసేపయిన తర్వాత విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి మానవహారాన్ని పోలీసులు భగ్నం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విధ్యార్ధి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మానవాహారం. భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్ధులు. చిత్తూరు జిల్లా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద విద్యార్థుల మానవహారం. విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద విద్యార్ధి యువజన సంఘాల ఆధ్వర్యంలో మానవహారం. దీనికి సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలు మద్దతు తెలిపాయి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ నిరసన తెలిపారు. నెల్లూరు జిల్లా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ నెల్లూరు నగరం మాగుంట సర్కిల్లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో మానవహారం. హోదా కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు తెలిపారు. -
వైఎస్సార్ సీపీ శ్రేణుల సమైక్య గళం
=అధినేత జగన్ పిలుపుతో పలు రూపాల్లో నిరసన =సమైక్య తీర్మానాలు, దిష్టిబొమ్మల దహనం =నరకాసుర వధ పేరిట వినూత్న కార్యక్రమాలు =ప్రధాని, రాష్ట్రపతికి ఎస్ఎంఎస్లు సాక్షి, విశాఖపట్నం: సమైక్యాంధ్ర ఉద్యమ సెగ లు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలు పు మేరకు పార్టీ శ్రేణులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నాయి. రిలే దీక్షలు, రాస్తారోకో, మానవహారాలు, దిష్టిబొమ్మ దహనం, ధర్నాలతో హోరెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అ వతర దినోత్సవం సందర్భంగా పార్టీ పిలుపు మేరకు సమైక్యాంధ్ర కోరుతూ రాష్ట్ర విభజన నరకాసుర వధ పేరిట విభజనవాదుల దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలను నియోజకవర్గాల్లో నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలో పంచాయతీల నుంచి సమైక్య తీర్మానాలు తీసుకున్నారు. యలమంచిలి నియోజకవర్గంలో సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలో సమైక్యాంధ్రకు మద్దతుగా గ్రామ సభ తీర్మానాల్ని చేసి, ప్రధానికి, రాష్ట్రపతికి ఎస్ఎంఎస్లు పంపారు. నర్సీపట్నం నియోజకవర్గంలో స్థానిక సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్‌గణేష్ ఆధ్వర్యం లో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షల్లో 15వ వార్డు నాయకులు ఉషారెడ్డి, మహిళలు పాల్గొన్నారు. పాడేరు నియోజకవర్గంలో సమన్వయకర్త వంజంగి కాంతమ్మ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణు లు సమైక్యాంధ్ర తీర్మానం చేశాయి. పంచాయతీలు చేసిన తీర్మానాల్ని అధిష్టానికి పంపించారు. అరకు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తలు కుంభా రవిబాబు, కిడారి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా పంచాయతీల తీర్మానం చేశారు. సోనియా, చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం చేపట్టారు. పెందుర్తి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త గండి బాబ్జీ నేతృత్వంలో పంచాయతీ ల నుంచి సమైక్యాంధ్ర తీర్మానాలు సేకరించారు. భీమిలి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కోరాడ రాజబాబు ఆనందపురం మండలంలోని పంచాయతీల నుంచి సమైక్య తీర్మానాలు సేకరించారు. తగరపువలసలో అక్కరమాని విజయనిర్మల ఆధ్వర్యంలో నరకాసుర వధ పేరిట విభజనవాదుల దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో పార్టీ నగ ర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ నేతృత్వంలో చినవాల్తేరులో ‘విభజన నరకాసుర వధ’లో భాగంగా సోనియా, చంద్రబాబు దిష్టి బొమ్మ ల్ని దహనం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతు గా నినాదాలు చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త జి.వి.రవిరాజు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా గురుద్వార కూడలి వద్ద రాస్తారోకో, సోనియా, చంద్రబాబుల దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. విశాఖ దక్షిణ నియోజక వర్గంలో పార్టీ సమన్వయకర్త కోలా గురువులు ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని 14 వార్డుల నేతలతో సమైక్య తీర్మానాలు చేయించి పార్టీ అధిష్టానా నికి పంపించారు. సాయంత్రం ‘రాష్ట్ర విభజన నరకాసురుల వధ’ పేరిట సోనియా గాంధీ, చంద్రబాబు దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. విశాఖ పశ్చిమ నియోజక వర్గంలో పార్టీ నగర బీసీ సెల్ కన్వీనర్ పక్కి దివాకర్ నేతృ త్వంలో మల్కాపురం కూడలిలో సోనియా దిష్టి బొమ్మకు చంద్రబాబు, దిగ్విజయ్‌సింగ్, చిదంబరం, షిండే, కేసీఆర్, హరీష్‌రావు, కిర ణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, ఉత్తమ్‌కుమార్, జానారెడ్డి తలల్ని తగిలించి మొత్తం పది తలల దిష్టిబొమ్మను ఊరేగించారు. నరకా సుర వధ పేరిట అనంతరం దాన్ని దహనం చేశారు. గాజువాక నియోజకవర్గంలో పార్టీ సమ న్వయకర్త తిప్పలనాగిరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. 51, 52 వార్డుల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టారు.