కర్నూలు జిల్లాలోని నన్నూరు నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు.
నారాయణ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
Jul 29 2017 2:11 PM | Updated on Nov 9 2018 4:36 PM
కర్నూలు: కర్నూలు జిల్లాలోని నన్నూరు నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రొద్దుటూరుకు చెందిన శ్రీహర్ష ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాడు. చదువుకోవాలని ఉపాధ్యాయులు పెట్టడంతో ఒత్తిడి తట్టుకోలేక శనివారం ఉదయం కళాశాల భవనం ఎక్కి కిందకు దూకాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. విద్యార్థి కాలు, చేయి విరిగినట్లు సమాచారం. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్ది సంఘాలు కాలేజీ దగ్గర ఆందోళనకు దిగాయి.
Advertisement
Advertisement