
సాక్షి, విశాఖపట్నం: మాది పేద బ్రాహ్మణ కుటుంబం. మా నాన్నగారు కేటరింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నాకు ఎంసెట్‌లో 24 వేలు ర్యాంక్ వచ్చింది. గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ బ్రాంచిలో అడ్మిషన్ వస్తే చేరాను. బ్రాహ్మణులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని దరఖాస్తు తిరస్కరించారన్నా. ఫీజులు మొత్తం మీరే కట్టుకోవాలని కాలేజీ వాళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాను. గత్యంతరం లేక ఇంట్లో ఉన్న కొద్దిపాటి బంగారం అమ్మడంతోపాటు, నాన్న ప్రైవేటు ఫైనాన్షియర్ల వద్ద అప్పు చేసి మొదటి రెండు సంవత్సరాల ఫీజు చెల్లించేశారు. ఇంకా రూ.లక్ష చెల్లించాల్సి ఉందన్నా. ఈ ఏడాది బకాయిలన్నీ కట్టకపోతే సెమిస్టర్ పరీక్షలు రాయనీయమని కళాశాల యాజమాన్యం చెబుతోంది. మాలాంటి పేద బ్రాహ్మణుల పరిస్థితి ఇంతేనా..?
– జ్యోతి స్వరూప, ఇంజినీరింగ్ విద్యార్థి, లలితానగర్, విశాఖపట్నం