బతుకు‘బందీ’

Street Chilodren in YSR kadapa - Sakshi

మారని రాతలు.. బాగుపడని బతుకులు.. బడికెళ్లలేని పిల్లలు.. ఆర్థిక అవసరాలో.. అనాథల పిల్లలో.. పొట్టకూటి కోసం ఆరాటం..  వెళుతున్న బండ్లతో పోరాటం.. రోజూ ఇదే వీరి సాహసం. ప్రమాదమని తెలిసినా బడికి వెళ్లాల్సిన పిల్లలు కదులుతున్న బస్సులో ప్రయాణికులకు తినుబండారాలు, వాటర్, మజ్జిగ ప్యాకెట్లు విక్రయిస్తూ వచ్చిన డబ్బుతో పొట్ట నింపుకుంటున్నారు. మరో వైపు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. రైల్వేకోడూరు పాతబస్టాండులో బడిఈడు పిల్లల పరిస్థితి ఇది. బాలకార్మిక చట్టాలు సరిగా అమలవుతున్నా.. అధికారుల కంట పడినా వీరి రాతలు మారుతాయేమో కదా!!    –కె.సుబ్బరాయుడు(రైల్వేకోడూరు రూరల్‌)   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top