‘జైత్రయాత్ర’ను విజయవంతం చేయండి | 'Streak' to the success of jaitra yatra | Sakshi
Sakshi News home page

‘జైత్రయాత్ర’ను విజయవంతం చేయండి

Oct 18 2013 4:20 AM | Updated on Sep 1 2017 11:44 PM

విజయవంతం చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. గురువారం జైత్రయాత్ర సభ ఏర్పాట్లపై డీసీసీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు.

 టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్ : ఈనెల 27న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే జైత్రయాత్ర సభను విజయవంతం చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. గురువారం జైత్రయాత్ర సభ ఏర్పాట్లపై డీసీసీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చొరవతో అక్టోబర్ 3న కేంద్ర కేబినేట్ తెలంగాణ నోట్‌కు ఆమోదముద్ర వేసినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలపడం, ఈ విషయంపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జైత్రయాత్ర విజయవంతానికి నియోజకవర్గాల వారీగా శుక్రవారం నుంచి సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు.సభకు తెలంగాణలోని పది జిల్లాల్లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

డీసీసీ అధ్యక్షుడు కె.రవీందర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్సీలు సంతోష్‌కుమార్, భానుప్రసాద్‌రావు, టి.జీవన్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కోడూరి సత్యనారాయణగౌడ్, కోలేటి దామోదర్, బాబర్‌సలీంపాషా, ఎం.సురేందర్‌రెడ్డి, డి.శంకర్, జువ్వాడి కృష్ణారావు, కేతిరి సుదర్శన్‌రెడ్డి, కన్న కృష్ణ, వై.సునీల్‌రావు, కౌశిక హరి, సర్వర్‌పాషా, అంజనీప్రసాద్, గుగ్గిళ్ల జయశ్రీ, కోమటిరెడ్డి నరెందర్‌రెడ్డి, నిఖిల్‌చక్రవర్తి, జితేందర్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement