ఎస్‌.కోట ఎమ్మెల్యేకు అరుదైన అవకాశం

Srungavarapukota MLA Kadubandi Srinivasa Rao As AP Andhra Pradesh Legislative Assembly Subordinate Law Member - Sakshi

సాక్షి, విజయనగం(శృంగవరపుకోట) : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సబార్డినేట్‌ చట్ట సభ్యులుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాసనసభ సబార్డినేట్‌ చట్ట సభ్యులుగా మొత్తం 11 మంది శాసనసభ్యులతో ఈ కమిటీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఏకైక శాసనసభ సభ్యునిగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కమిటీలో చోటు దక్కడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవికి ఎంపిక చేసిన సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, స్పీకర్‌ తమ్మినేని సీతారాంలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరింత చురుకుగా పనిచేసి ఎంపిక చేసిన పదవికి న్యాయం చేస్తానని, శృంగవరపుకోట నియోజకవర్గ అభివృద్ధికి అలుపెరుగని కృషి చేస్తానని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top