నాలుగు దశాబ్దాల నాటి ముచ్చట్లు! | SRR And CVR College Memorable Get Together | Sakshi
Sakshi News home page

నాలుగు దశాబ్దాల నాటి ముచ్చట్లు!

Jun 23 2019 8:46 PM | Updated on Jun 23 2019 8:52 PM

SRR And CVR College Memorable Get Together - Sakshi

సాక్షి, కృష్ణా: విజయవాడలోని ఎస్ఆర్ఆర్‌ సీవీఆర్ గవర్నమెంట్ కాలేజీలో బీ.కాం (1975-1978) చదువుకున్న క్లాస్ మేట్స్ నాలుగు దశాబ్దాల తర్వాత ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. అంతా ఒక్కసారిగా యంగ్ తరంగ్గా మారిపోయారు. వారంత కలిసిన తరువాత టీనేజ్ ముచ్చట్లు, కాలేజీ రోజులు నెమరు వేసుకున్నారు. అంతా 60 పైబడిన వాళ్లే వయసులో మాత్రమే.. జ్ఞాపకాలకు వయసుతో ఏం సంబంధం? నాటి కబుర్లు నెమరువేసుకుంటూ రోజంతా సంతోషంగా గడిపేశారు. 

హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో కలుసుకున్న క్లాస్ మేట్స్ అందరి కళ్లలో ఆ నాటి యంగ్ మెరుపులు మళ్లీ మెరిశాయి. ఉత్సాహం ఉరకలు వేసింది. అందరిలో ఎంతో తృప్తి, ఇన్నాళ్లకు కలుసుకున్నామన్న ఆనందం ప్రతి ఒక్కరిలో పెల్లుబికింది. కాలేజీనాటి కబుర్లే కాదు, డిగ్రీ తరువాత ఎవరి ప్రయాణం ఎలా జరిగింది, ఉన్నత చదువులు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, సంసారం, కాలచక్ర భ్రమణం ఎవరెవరిని ఏ తీరానికి తీసుకువెళ్లిందీ చెబుతున్నపుడు ఒక్కోరు ఒక్కో కథకులే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement