breaking news
SRR College students
-
నాలుగు దశాబ్దాల నాటి ముచ్చట్లు!
సాక్షి, కృష్ణా: విజయవాడలోని ఎస్ఆర్ఆర్ సీవీఆర్ గవర్నమెంట్ కాలేజీలో బీ.కాం (1975-1978) చదువుకున్న క్లాస్ మేట్స్ నాలుగు దశాబ్దాల తర్వాత ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. అంతా ఒక్కసారిగా యంగ్ తరంగ్గా మారిపోయారు. వారంత కలిసిన తరువాత టీనేజ్ ముచ్చట్లు, కాలేజీ రోజులు నెమరు వేసుకున్నారు. అంతా 60 పైబడిన వాళ్లే వయసులో మాత్రమే.. జ్ఞాపకాలకు వయసుతో ఏం సంబంధం? నాటి కబుర్లు నెమరువేసుకుంటూ రోజంతా సంతోషంగా గడిపేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కలుసుకున్న క్లాస్ మేట్స్ అందరి కళ్లలో ఆ నాటి యంగ్ మెరుపులు మళ్లీ మెరిశాయి. ఉత్సాహం ఉరకలు వేసింది. అందరిలో ఎంతో తృప్తి, ఇన్నాళ్లకు కలుసుకున్నామన్న ఆనందం ప్రతి ఒక్కరిలో పెల్లుబికింది. కాలేజీనాటి కబుర్లే కాదు, డిగ్రీ తరువాత ఎవరి ప్రయాణం ఎలా జరిగింది, ఉన్నత చదువులు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, సంసారం, కాలచక్ర భ్రమణం ఎవరెవరిని ఏ తీరానికి తీసుకువెళ్లిందీ చెబుతున్నపుడు ఒక్కోరు ఒక్కో కథకులే. -
'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ... విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం స్థానిక ఎస్.ఆర్.ఆర్ కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. అనంతరం ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ విద్యార్థుల నినాదాలతో నగర రహదారులు మార్మోగాయి. అనంతరం రహదారిపై మానవహారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రాణ త్యాగం చేసిన మునికోటి ఆశయాలను సాధించుకోవడం కోసం విద్యార్థులంతా కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకునేంత వరకు అవిశ్రాంతంగా పోరాడాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నేతలు పిలుపు నిచ్చారు.