చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బి.రామిరెడ్డిని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా బదిలీచేశారు.
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బి.రామిరెడ్డిని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా బదిలీచేశారు. ఈ మేరకు దేవాదాయశాఖ నుంచి శ్రీకాళహస్తి దేవస్థానానికి శనివారం ఉత్తర్వులు అందాయి. 2014 నవంబర్ 20వ తేదీ రామిరెడ్డి ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఏడాది గడవక ముందే నాయకుల ఒత్తిళ్లతో ఆయన బదిలీపై వెళుతున్నట్లు తెలుస్తోంది. విభజన తర్వాత ఇటీవల ఏపీకి మార్చిన భద్రాచలం ఆలయ ఈవో రఘునాథ్, కాకినాడ దేవాదాయశాఖ రీజనల్ జాయింట్ డెరైక్టర్(ఆర్జేడీ)గా పనిచేస్తున్న ఆజాద్, సింహాచలం ఆలయ ఈవోగా పనిచేస్తున్న భ్రమరాంబ శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా రావడానికి పోటీలో ఉన్నట్లు తెలిసింది.