
సాక్షి, హైదరాబాద్ : శ్రీరామ నవమి సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ రాముడి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.
దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవములు అంగరంగ వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. పలు ఆలయాలు ప్రత్యేక అలంకరణతో శోభయమానంగా, కనులవిందుగా అలరారుతున్నాయి. భక్తులు కిక్కిరిసిపోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం ట్విటర్ ద్వారా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలుగు వారందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పారు. ‘మీకు, మీ కుటుంబ సభ్యులకు, శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీ రాముడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు, శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీ రాముడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 26 March 2018