చలో అసెంబ్లీకి అనుమతి లేదు.. | SP Vijayarao Said No Permission For Chalo Assembly | Sakshi
Sakshi News home page

చలో అసెంబ్లీకి అనుమతి లేదు..

Jan 20 2020 10:04 AM | Updated on Jan 20 2020 10:29 AM

SP Vijayarao Said No Permission For Chalo Assembly - Sakshi

సాక్షి, అమరావతి: చలో అసెంబ్లీకి అనుమతి లేదని.. ముట్టడికి యత్నిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విజయరావు హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ముసుగులో రెచ్చగొట్టేందుకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ నెల 31 వరకు 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంత ప్రజలు సహకరిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు.
 

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ  వినీత్‌ బ్రిజ్‌లాల్‌
అసెంబ్లీ వద్ద భద్రతా ఏర్పాట్లను గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అరాచక శక్తులపై నిఘా పెట్టామని పేర్కొన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తామని చెప్పారు. అసెంబ్లీకి వచ్చే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెకింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గరుడా కమాండ్‌ కంట్రోల్‌ నుంచి సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement