ఏపీ ప్రభుత్వ కొత్త కార్యదర్శిగా అజేయ కల్లంను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది.
హైదరాబాద్:
ఏపీ ప్రభుత్వ కొత్త కార్యదర్శిగా అజేయ కల్లంను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 1983 బ్యాచ్ కు చెందిన అజయ్ కల్లం ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మార్చి 31వ తేదీతో అజేయ కల్లం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో మరొకరిని నియమించే అవకాశాలున్నాయంటూ వార్తలు రావటంతో కొంత ఆసక్తి ఏర్పడింది. అయితే, అజేయ కల్లంనే సీఎస్‌గా నియమించేందుకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కాగా, అజేయ కల్లం పదవీ కాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుత సీఎస్ టక్కర్ పదవీ కాలం రేపటితో ముగియనుంది.