పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలంలో ఆస్తి విషయమై తలెత్తిన తగాదాలు ఒకరి హత్యకు దారి తీశాయి.
కాళ్ల (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలంలో ఆస్తి విషయమై తలెత్తిన తగాదాలు ఒకరి హత్యకు దారి తీశాయి. వివరాల ప్రకారం... మండలంలోని దొడ్డనపూడికి చెందిన నాగరాజుతో అతని భార్య కుటుంబీకులకు తగాదాలున్నాయి. శనివారం మధ్యాహ్నం ఈ విషయమై మాట్లాడేందుకు భీమవరంలో ఉంటున్న అత్త నాగమణి(55), వదిన లక్ష్మీఝాన్సీ(35) నాగరాజు ఇంటికి వచ్చారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే సమయంలో నాగరాజు ఇంట్లో ఉన్న కత్తితో వారిద్దరిపై దాడి చేశాడు. నాగమణి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన లక్ష్మీఝాన్సీని చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు.